భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని అమాయక గిరిజనుల వద్ద నగదు వసూలు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది వ్యక్తులు పలు గ్రామాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద రూ.1500 నుంచి రూ.2,500 వరకు వసూలు చేశారు. ఈ విషయాన్ని "ఈటీవీ భారత్" వెలుగులోకి తెచ్చింది. ఆ కథనాల ఆధారంగా విచారణ చేపట్టిన అధికారులు విచారణ చేపట్టి తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్టైన వారిలో ప్రధాన నిందితుడు ఉదయ కిరణ్, నాగేశ్వరరావు, గుండెకి సీతారాములు ఉన్నట్లు సీఐ అబ్బాయి తెలిపారు. ఇదే కేసులో నిందితులైన బాలచందర్, అగస్టీన్ పరారీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. వీరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించామని అన్నారు. ఈ కేసులో బాధితులకు న్యాయం చేస్తామని సీఐ తెలిపారు.
"డబుల్" పేరుతో వసూళ్లు.. పోలీసుల అదుపులో నిందితులు! - గిరిజనులను మోసం చేసిన వ్యక్తుల అరెస్టు
డబుల్ ఇళ్ల పేరుతో మోసానికి పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరుగుతున్న ఈ తంతును "ఈటీవీ భారత్" వెలుగులోకి తీసుకొచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
!["డబుల్" పేరుతో వసూళ్లు.. పోలీసుల అదుపులో నిందితులు!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4251859-thumbnail-3x2-arrgupta.jpg)
మోసగాళ్ల అరెస్టు
ఈటీవీభారత్ కథనానికి స్పందన... మోసగాళ్ల అరెస్టు
ఇదీ చూడండి : బాలుణ్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఆటోడ్రైవర్