భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం క్రాంతిపురంలో పోలీసులు ఏర్పాటు చేసిన చేతిపంపును ఇవాళ ప్రారంభించారు. గతంలో గ్రామాన్ని పోలీసులు సందర్శించినప్పుడు గుత్తికోయలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను చూసి చలించిపోయారు.
ఆదివాసీ పల్లెలో పోలీసుల 'జలకళ' - గుత్తికోయల తాగునీటి సమస్య తీర్చిన చర్ల పోలీసులు
గ్రామంలో ప్రజల తాగునీటి సమస్యను చూసి చలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు... క్రాంతిపురంలో చేతిపంపు ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారుల సాహకారంతో ఏర్పాటు చేసి ఇవాళ ప్రారంభించారు.
సమస్య చూసి చలించారు.. ఇప్పుడు పరిష్కరించారు
ఎస్పీ సునీల్ దత్, ఓఎస్డీ తిరుపతి, ఏఎస్పీ వినీత్‌కు సమస్య వివరించి... పరిష్కారించారు. చేతిపంపును ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను దూరం చేశారు. చర్ల మండల ప్రజల సమస్యలు తీర్చడానికి అన్ని విధాలు గా సాయపడతామని పోలీసులు తెలిపారు.