తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామికి చక్రస్నానం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారాముల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోదావరి నదిలో చేయాల్సిన చక్రస్నానం కార్యక్రమాన్ని... కరోనా కారణంగా ఆలయంలోనే నదీ జాలలు తీసుకొచ్చి నిర్వహించారు. నేడు సాయంత్రం పూర్ణాహుతి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.

Chakrasnanam to Bhadradri Sri Sita Ramachandra Swamy
శ్రీ సీతారామచంద్ర స్వామికి చక్రస్నానం.

By

Published : Apr 27, 2021, 3:31 PM IST

శ్రీ సీతారామచంద్ర స్వామికి చక్రస్నానం

భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయంలో వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. ప్రతి సంవత్సరం గోదావరి నదిలో చక్రస్నానం నిర్వహించే అర్చకులు... కరోనా కారణంగా ఆలయం లోపల బేడా మండపం వద్ద నిర్వహించారు. ముందుగా నది జలాలను తీసుకువచ్చి గోదావరి నదీమాతను ఆవాహనం చేసి సుదర్శన చక్ర స్నానం చేయించారు.

అనంతరం లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. నేడు సాయంత్రం బ్రహ్మోత్సవాల పరిసమాప్తిలో భాగంగా పూర్ణాహుతి ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కొవిడ్​ నిబంధనల నేపథ్యంలో భక్తులు లేకుండానే సీతారాముల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:'జాతీయ సంక్షోభాన్ని చూస్తూ ఉండలేం'

ABOUT THE AUTHOR

...view details