భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఎన్నికావడం పట్ల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. భద్రాచలం వచ్చిన శాసనసభ్యుడికి బ్రిడ్జి సెంటర్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం రేలా, కొమ్ము నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేకు కొమ్ములను అలంకరించి నృత్యం చేయించారు. ఈ ర్యాలీలో గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారీగా హాజరైన కార్యకర్తలతో భద్రాచలం రోడ్లన్నీ సందడిగా మారాయి.
భద్రాచలంలో కాంగ్రెస్ కార్యకర్తల సంబురాలు - డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే పొదెం వీరయ్య
భద్రాద్రి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఎన్నికావడాన్ని హర్షిస్తూ.. భద్రాచలంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు.
![భద్రాచలంలో కాంగ్రెస్ కార్యకర్తల సంబురాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4922608-thumbnail-3x2-df.jpg)
కాంగ్రెస్ కార్యకర్తల సంబురాలు