తెలంగాణ

telangana

ETV Bharat / state

case booked against person for forging tsgenco cmds signature : ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షలకు టెండర్​.. జెన్​కో సీఎండీ సంతకం ఫోర్జరీ.. - టీఎస్​జెన్​కో సీఎండీ తాజా వార్తలు

Case Booked Against Person for Forging TSGENCO CMD Signature : టీఎస్‌ జెన్​కోలో ఉద్యోగం వచ్చిందని నకిలీ నియామకపత్రం ఇచ్చిన ఓ వ్యక్తిపై జెన్​కో విజిలెన్స్ అధికారులు ఖైరతాబాద్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏకంగా జెన్​కో సీఎండీ ప్రభాకర్​రావు సంతకం ఫోర్జరీ చేసిన ఈ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Cheeting Case On Tsgenco Employee 2023
Case Booked Against Person For Forging TSGENCO Cmd Signature

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2023, 5:57 PM IST

Case Booked Against Person For Forging TSGENCO CMD Signature : టీఎస్‌ జెన్​కోలో ఉద్యోగం వచ్చిందని నకిలీ అపాయింట్‌ లెటర్‌ ఇచ్చిన ఓ వ్యక్తిపై జెన్​కో విజిలెన్స్(GENCO Vigilence) అధికారులు ఖైరతాబాద్‌ పోలీసు స్టేషన్‌లో చీటింగ్​ కేసు నమోదు చేశారు. భద్రాచలంలోని ఐటీసీ సంస్థలో ఉద్యోగి అయిన ప్రవీణ్‌ తనకు జెన్​కో సీఎండీ ప్రభాకర్‌రావు(GENCO CMD Prabakar Rao)తో మంచి సంబంధాలున్నాయని అదే సంస్థలో కార్మికుడిగా పని చేస్తున్న మాడపాటి రాజశేఖర్‌కు చెప్పాడు. అంతేకాకుండా సంస్థలో ​ఎలక్ట్రీషియన్​ఉద్యోగంఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకు తనకి రూ.10 లక్షలు ముట్టజెప్పాలనే ఒప్పందంతో రాజశేఖర్​తో బేరం కుదుర్చుకున్నాడు.

'శ్రీశైలం ఘటనపై కమిటీ వేశాం.. కుటుంబాలకు అండగా ఉంటాం'

Cheeting Case On Tsgenco Employee 2023 : ఉద్యోగం వచ్చిన తర్వాతే డబ్బు ఇస్తానని రాజశేఖర్‌ చెప్పాడు. దీంతో డబ్బులు ఎలాగైనా చేతింకాదాలనే ఉద్దేశ్యంతో ప్రవీణ్​ ఈ నెల 29న రాజశేఖర్​కు మణుగూరులో ఉద్యోగం వచ్చినట్లు, జెన్​కో సీఎండీ ప్రభాకర్ రావు పేరిట అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీని ఇచ్చాడు. ముందుగా అనుకున్న ప్రకారం డబ్బులు ఇవ్వమని కోరాడు. అయితే నియామక పత్రాన్ని నేరుగా ఇవ్వకుండా వాట్సాప్​ ద్వారా పంపించాడు ప్రవీణ్​.

తక్కువ వ్యవధిలో ఉద్యోగం ఇప్పించేసరికి రాజశేఖర్​కు నమ్మకం కుదరలేదు. అనుమానంతో కూకట్​పల్లికి చెందిన ఎన్. సురేంద్రకుమార్​ అనే వ్యక్తికి ఆ నియామక పత్రం చూపించాడు. ప్రవీణ్​తో కుదుర్చుకున్న ఒప్పందం గురించిన విషయం చెప్పి విచారించమని కోరాడు. అతడు ప్రవీణ్​ ఇచ్చిన ఆర్డరు పత్రంతో ఖైరతాబాద్​లోని విద్యుత్‌ సౌధకు వెళ్లి అధికారులను కలిసి ఆరా తీశాడు.

విద్యుత్​ కార్యాలయంలోని విజిలెన్స్​ విభాగం వారు విచారించగా నియామక పత్రం నకిలీదని తేలింది. దానిపై జెన్​కో సీఎండీ ప్రభాకర్‌రావు సంతకం ఉండడంతో విజిలెన్స్​ అధికారులు అది ఫోర్జరీ సంతకం అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్​ పోలీసులు ప్రవీణ్‌పై ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Fake job racket busted: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

Transco Genco CMD Signature Forgery : ఓ వ్యక్తి అక్రమంగా తన సంతకం ఫోర్జరీ చేసి మోసం చేయడానికి ప్రయత్నించిన విషయం తెలుసుకున్న ట్రాన్స్​కో, జెన్కో సీఎండీ ప్రభాకర్​రావు దీనిపై స్పందించారు. విద్యుత్ సంస్థలో ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మొద్దని, సంస్థలో ఉద్యోగాలకు ఖాళీలు ఉంటే వాటికి నోటిఫికేషన్లు ఇస్తామని, సంబంధిత విభాగాల్లో అవసరమైన నైపుణ్య పరీక్షలు నిర్వహించి వారి అర్హతల ఆధారంగానే అభ్యర్తులను ఎంపిక చేస్తామని ఈ తరహాలోనే సంస్థలో ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని, ఇందులో మధ్యవర్తుల ప్రమేయం ఏమాత్రం ఉండదని, ప్రస్తుతం విద్యుత్​ సంస్థలో ఖాళీలు లేవని సీఎండీ ప్రభాకర్​రావు స్పష్టం చేశారు. ఎటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు.


బీటీపీఎస్​ రెండో యూనిట్​ బాయిలర్​ లైటప్​ విజయవంతం

'విద్యుత్​ డిమాండ్​ పడిపోయినా.. గ్రిడ్​కు ఇబ్బందేం లేదు'

ABOUT THE AUTHOR

...view details