BRS Political Heat in Yellandu :రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) వేళ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టొద్దని.. పలువురు నేతలు గత కొంతకాలంగా అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఈ విషయం మంత్రి కేటీఆర్ (Minister KTR)తోనూ చర్చించారు. అభ్యర్థి ఎంపిక(BRS Candidate Selection) విషయం పార్టీకి వదిలేయాలని వారికి సర్దిచెప్పిన మంత్రి, నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయమని అసమ్మతి నాయకులకు సూచించారు. అయినప్పటికీ నేతల మధ్య అసంతృప్తి కొనసాగుతుండడంతో.. ఇల్లందు నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ రాజకీయం రసవత్తరంగా మారింది.
Satyavathi Participated Dissenting Councillors Meeting in yellandu :ఈ నేపథ్యంలోనే అసమ్మతిని చల్లార్చే బాధ్యతను కేటీఆర్.. మంత్రి సత్యవతి రాఠోడ్(Minister Satyavathi Rathod), ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు అప్పగించారు. వారు ఈరోజు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌తో కలిసి.. మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, అసమ్మతి గళం వినిపిస్తున్న పలువురు నాయకులతో చర్చలు జరిపారు. తొలుత అసమ్మతి గళం వినిపిస్తున్న మున్సిపల్ ఛైర్మన్ డీవీ ఇంటికి.. మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ వద్దిరాజు వెళ్లారు. ఆయనను బుజ్జగించి.. ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు.
CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు..
KCR Public Meeting at Yellandu on 1st November :ఈ పరిణామంతో మున్సిపల్ ఛైర్మన్‌తో విభేదిస్తూ వస్తున్న పలువురు ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లు(Councillors) అలిగారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అయితే వచ్చే నెల 1న ఇల్లందులో కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్లో నెలకొన్న అసంతృప్తి సెగలు అప్పటికి చల్లారుతాయా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది.