రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు మ్యూకర్మైకోసిస్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ మహిళ ఫంగస్ బారిన పడ్డారు.
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసుల కలకలం - బ్లాక్ ఫంగస్ మరణాలు
కొవిడ్ నుంచి కోలుకున్నవారికి.. బ్లాక్ ఫంగస్ మరో ముప్పుగా మారుతోంది. దేశంలో ప్రస్తుతం ఈ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతువుతున్నాయి. రాష్ట్రంలోనూ మ్యూకర్మైకోసిస్ బారిన పడి ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ మహిళ ఫంగస్ బారిన పడ్డారు.
telangana black fungus cases
అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురానికి చెందిన సులోచన.. ఈనెల 10న కొవిడ్ బారిన పడ్డారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది.. నెగెటివ్ రావటంతో 14 న డిశ్చార్జ్ అయ్యారు. 17న ఆమె కళ్లు వాయటంతో.. పెనుబల్లిలోని ఓ హాస్పిటల్లో చేరారు. వైద్యులు ఆమెను పరీక్షించి.. బ్లాక్ ఫంగస్‌గా నిర్ధరించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:కనికరం చూపని కన్నబిడ్డలు.. ప్రాణగండంతో వృద్ధురాలు