తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే సమక్షంలో తెరాసలో 30 కుటుంబాల చేరిక - pv narasimha rao

ఇల్లందులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సమక్షంలో భాజపాకు చెందిన 30 కుటుంబాలు తెరాసలో చేరాయి.

bjp famileis joined in trs in bhadradri kothagudem district
ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో తెరాసలో చేరిన 30 కుటుంబాలు

By

Published : Jun 28, 2020, 10:50 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో భాజపాకు చెందిన 30 కుటుంబాలు తెరాస పార్టీలో చేరాయి. గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే హరిప్రియ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: సంస్కర్తకు సరైన గౌరవం దక్కలేదు: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details