తెలంగాణ

telangana

ETV Bharat / state

హెల్మెట్.. జీవితాన్ని రక్షిస్తుంది: సీఐ స్వామి - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శిరస్త్రాణ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ.. ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీ ప్రారంభించారు.

Bike rally for raising awareness on helmet preference by bhadrachalam police
శిరస్త్రాణ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ బైక్​ ర్యాలీ

By

Published : Feb 16, 2021, 2:18 PM IST

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా భద్రాచలంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహన ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. సీఐ స్వామి, ట్రాఫిక్ ఎస్ఐ సురేశ్​, టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు శిరస్త్రాణ ప్రాధాన్యతపై ర్యాలీ చేస్తూ.. అవగాహన కల్పించారు.

పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ సెంటర్ మీదుగా కొనసాగింది. ర్యాలీలో పట్టణ యువకులతో పాటు సివిల్, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపాలని.. ప్రమాదాలను అరికట్టాలని సీఐ సూచించారు.

ఇదీ చూడండి:పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్

ABOUT THE AUTHOR

...view details