పులుసు బొంత ప్రాజెక్టు నిర్మించి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లా పినపాక నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. కరకగూడెం, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో రూ. 12 కోట్లతో నిర్మించే రహదారి, వంతెనల పనులకు భూమి పూజ చేసి, శిలాఫలకాల్ని ఆవిష్కరించారు.
ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం
పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని పువ్వాడ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానుందని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి జిల్లాలోని 7 లక్షల 75 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు.