భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారాంనగర్ కాలనీకి చెందిన ప్రకాశ్ ఉమ్మడి జిల్లాలోని పల్లెపల్లెకు తిరిగి ప్రజలకు కరోనా వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. మార్చి 30వ తేదీ నుంచి నేటి వరకు ఖమ్మం, భద్రాద్రి జిల్లా లోని పలు గ్రామాల్లో సైకిల్ మీద తిరుగుతూ ఈ యాత్ర కొనసాగిస్తున్నారు.
కరోనాపై అవగాహనకు సైకిల్ యాత్ర - awareness on corona by bicycle trip
కరోనాపై అవగాహన కల్పించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి సైకిల్ యాత్ర చేపట్టాడు. ఊరూర తిరుగుతూ ప్రజలకు మహమ్మారి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాడు.
![కరోనాపై అవగాహనకు సైకిల్ యాత్ర bhdhradri resident bicycle trip to give awareness on corona crisis](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7148522-925-7148522-1589174339468.jpg)
కరోనాపై అవగాహనకు సైకిల్ యాత్ర
40 రోజుల నుంచి సుమారు 1,500 కిలోమీటర్లకు పైగా తిరుగుతూ 700 గ్రామాల్లో ఈ సైకిల్ యాత్ర చేపట్టారు. ఆయా గ్రామాల్లో పేద ప్రజలకు ప్రజా ప్రతినిధులు అందించే నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాల వద్ద కూడా ప్రజలకు అవగాహన కల్పించేవారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరించేవారు.
మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, భద్రాద్రి జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రకాశ్‌ను అభినందించారు.