భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న భట్టి విక్రమార్క - భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న భట్టి విక్రమార్క
భద్రాద్రి రామయ్యను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న భట్టి విక్రమార్క
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామ చంద్ర స్వామిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొన్నారు. భట్టి విక్రమార్కకు ఆలయ అధికారులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.