తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాచలంలో భారత్​ బంద్​ ప్రశాంతం - Bharat Bandh news

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భారత్​ బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాన రహదారిపై వామపక్ష, ప్రతిపక్ష నాయకులు రాస్తారోకో నిర్వహించారు. పెట్రోల్ బంకులు, వ్యాపార దుకాణాలు అన్నింటిని నిలిపివేశారు.

Bharat Bandh, bhadrachalam
Bharat Bandh in bhadrachalam

By

Published : Mar 26, 2021, 10:15 AM IST

రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోనూ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి వామపక్ష, ప్రతిపక్ష నాయకులు ఆర్టీసీ బస్టాండ్​లోని బస్సులను బయటికి వెళ్లకుండా ఆపేశారు.

ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని... ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపేయాలని నాయకుడు డిమాండ్​ చేశారు. పెట్రోల్ బంకులు, వ్యాపార దుకాణాలు అన్నింటిని నిలిపివేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరోమారు భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details