భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో వామపక్షాలతో పాటు తెలుగుదేశం శ్రేణులూ బంద్‌లో పాల్గొన్నాయి.
అశ్వరావుపేటలో ప్రశాంతంగా కొనసాగుతున్న భారత్ బంద్ - తెలంగాణ వార్తలు
అశ్వరావుపేట నియోజకవర్గంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో వామపక్షాలు, తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు.
భారత్ బంద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారత్ బంద్
నూతన సాగు చట్టాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి బంద్‌కు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో కనిపించని భారత్ బంద్ ప్రభావం