నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన భారత్ బంద్కు మద్దతు తెలుపుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భాజపాయేతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు ఉదయం నుంచి స్వచ్ఛందంగా బస్సులను నిలిపివేశారు. పట్టణంలోని ప్రైవేటు వాహనాలు నడపడం లేదు. దుకాణాలను తెరవకుండా అడ్డుకుంటున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భద్రాచలంలో భారత్ బంద్... కదలని ఆర్టీసీ బస్సులు - రైతులకు మద్దతుగా భారత్ బంద్
భారత్ బంద్కు మద్దతుగా భద్రాచలంలో భాజపాయేతర పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా బస్సులను నిలిపివేశారు. ఈ ఆందోళనలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భద్రాచలంలో భారత్ బంద్... స్వచ్ఛందంగా బస్సులు నిలిపివేసిన ఆర్టీసీ
పెట్రోల్ బంకులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పనులు నిలిపివేశాయి. ఈ ఆందోళనలో తెరాస, తెదేపా, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ, గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అన్నదాతలకు మద్దతుగా బంద్... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు