భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్త రామదాసు జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు రామదాసు కీర్తనలు ఆలపించారు. చిన్నారులు ఆలపించిన సంగీత కీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
భద్రాచలంలో రెండో రోజు రామదాసు జయంతి ఉత్సవాలు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్త రామదాసు జయంతి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన సంగీత విద్వాంసులు, చిన్నారులు ఆలపించిన సంగీత కీర్తనలు ఆకట్టుకున్నాయి.
భద్రాచలంలో రెండో రోజు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు
శ్రీ చక్ర సిమెంట్ అధినేత కృష్ణమోహన్ ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు వేరే రాష్ట్రాల నుంచి సంగీత కళాకారుల వచ్చి సంగీత కీర్తనలు ఆలపిస్తారు. సంగీత కచేరిలో పాల్గొన్న చిన్నారులకు కృష్ణమోహన్ జ్ఞాపికను అందిస్తారు.
ఇవీ చూడండి:ఒక్కరోజే రూ.5వేలు తగ్గిన మిర్చి ధర.. ఖమ్మంలో ఉద్రిక్తత..