భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఐక్యతా దినోత్సవాన్ని ఏఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భద్రాచలం ఏఎస్పీ రాజేశ్చంద్ర ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
భద్రాచలం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఐక్యతా దినోత్సవం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసులు, సీఆర్పీఫ్ జవానులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు.

భద్రాచలం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఐక్యతా దినోత్సవం
భారతదేశ సమగ్రత కోసం సర్దార్ సేవలను కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఆహర్నిశలు తమవంతు కృషి చేయాలని పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. భారతీయ ఉక్కుమనిషిగా సమగ్ర భారతావనిని మనకు అందించారని ఏఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు.