Bhadradri Vaikunta Ekadashi Utsavalu 2023 : ఈ నెల 23న జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి రాముయ్య సన్నిధి సర్వం సిద్ధమైంది. దేశంలోనే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. డిసెంబర్ 23న తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ వైకుంఠ ఏకాదశి రోజు సీతారాములు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలను నేరుగా వీక్షించడానికి విశేష సంఖ్యలో కదిలి వచ్చే భక్తులకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు - పరశురామ అవతారంలో రామయ్య దర్శనం
Bhadrachalam Mukkoti Utsavalu 2023: భద్రాద్రి రామయ్య సన్నిధిలో డిసెంబర్ 13 నుంచి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జనవరి 2 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో డిసెంబర్ 23 వరకు పగలుపత్తు ఉత్సవాలు,(పగటిపూట నిర్వహించే ఉత్సవాలు) డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు రాపత్తు ఉత్సవాలు(రాత్రిపూట నిర్వహించే ఉత్సవాలు) నిర్వహిస్తున్నారు.
శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారు రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దశావతారాల్లో చివరి రోజైన గురువారం రోజున శ్రీరామచంద్ర స్వామి వారు శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 22న పవిత్ర గోదావరి నదిలో సాయంత్రం నాలుగు గంటలకు సీతారాములకు హంస వాహనంపై తెప్పోత్సవం వేడుక నిర్వహిస్తారు. 23న తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ వైకుంఠ ఏకాదశి రోజు సీతారాములు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు.