భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులకు జరిగే పంచామృతాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మణ సమేత సీతా రాములకు పుష్పార్చన చేశారు. భక్తుల రద్దీ పెరగడం వల్ల సర్వదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం నాలుగు గంటల వరకు ఆలయం మూసివేస్తామని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. మంగళవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని ఈవో తెలిపారు.
భద్రాచలం ఆలయంలో భక్తుల కిటకిట
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం భక్తులతో కిటికటలాడుతోంది. సర్వదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం నాలుగు వరకు ఆలయం మూసివేస్తామని ఈవో తెలిపారు.
భక్తులతో కిటకిటలాడుతోన్న భద్రాచలం