భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని సూర్య గ్రహణం అనంతరం ఆలయ అర్చకులు తెరిచారు. ఆలయ తలుపులు తెరిచి సంప్రోక్షణ నిర్వహించి గోదావరి నది వద్ద నుంచి పుణ్య జలం తీసుకువచ్చి ఆలయ శుద్ధి చేశారు. అనంతరం ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు, ఉప ఆలయాల్లో వేంచేసి ఉన్న వివిధ దేవతా మూర్తులకు తిరుమంజనం నిర్వహించారు.
గ్రహణం అనంతరం తెరుచుకున్న భద్రాద్రి రామాలయం - భద్రాచలం
సూర్య గ్రహణం అనంతరం భద్రాద్రి రామయ్య ఆలయ తలుపులను ఆలయ అర్చకులు తెరిచారు. సంప్రోక్షణ నిర్వహించి గోదావరి నది వద్ద నుంచి పుణ్య జలం తీసుకువచ్చి ఆలయశుద్ధి చేశారు.
సూర్య గ్రహణం అనంతరం తెరచుకున్న భద్రాద్రి రామయ్య ఆలయం
అనంతరం స్వామివారికి అర్చనలు, ఆరాధనలు, నివేదనలు నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి 6 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: సూర్యగ్రహణం ప్రభావం.. నిటారుగా నిలిచిన రోకలి