భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో సాగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతి లేకపోవడంతో... ఆలయ ప్రాంతాలన్ని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఏటా సీతారాముల కల్యాణం రోజు వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంతం కళకళలాడేది. కానీ కొవిడ్ ప్రభావంతో నేడు మిథిలా ప్రాంగణం కళ తప్పింది.
కొవిడ్ ప్రభావంతో భక్తులు లేక భద్రాద్రి వెలవెల - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో నేడు జరుగుతున్న సీతారాముల కల్యాణం వేడుకకు భక్తులను అనుమతించకపోవడంతో... ఆలయ ప్రాంతాలన్నీ వెలవెలబోయాయి. ఆలయం చుట్టు పక్కల గల రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
భక్తులు లేక భద్రాద్రి వెలవెల
భక్తులు ఎవరూ ఆలయ ప్రాంతాల వద్దకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయం చుట్టు పక్కల గల వీధులన్ని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఉత్తర ద్వారం, మిథిలా ప్రాంగణం, విస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రాల వైపు రహదారులన్నీ భక్తులు లేక వెలవెలబోతున్నాయి.
ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య