హోలీ పూర్ణిమ పర్వదినం సందర్భంగా భద్రాద్రి రామయ్యకు డోలోత్సవం, వసంతోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లక్ష్మణ సమేత సీతారాములకు భక్త రామదాసు కీర్తనల నడుమ ఫల, పుష్ప, ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు.
ఘనంగా భద్రాద్రి రామయ్య డోలోత్సవం - తెలంగాణ వార్తలు
భద్రాద్రి రామయ్య డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వసంతోత్సవాన్ని జరిపారు.
భద్రాద్రి రామయ్య డోలోత్సవం, భద్రాద్రి రామయ్య వసంతోత్సవం, భద్రాద్రి రాముడు
అనంతరం వసంతాన్ని తయారుచేసి ప్రధాన ఆలయంలోని స్వామివారికి, ఉపాలయాల్లోని దేవతామూర్తులకు చల్లారు. స్వామివారికి చల్లిన వసంతాన్ని భక్తులపై చల్లారు. అనంతరం భక్తులు ఒకరికి ఒకరు రంగులు పూసుకుని ఆనందంగా హోలీ జరుపుకున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు