తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి రామయ్య సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు - Sri Sita Rama Kalyanam

భద్రాద్రి రామయ్య సన్నిధిలో నేటి నుంచి శ్రీరామనవమి, తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు వేడుకలు జరుగుతాయి. 20న ఎదుర్కోలు, 21న సీతారాముల కల్యాణం, 22న మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

badradri Sri Ramanavami celebrations, bhadrachalam news today
నేటి నుంచి రామయ్య సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు

By

Published : Apr 13, 2021, 4:12 AM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో నేటి నుంచి వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి, తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్​ దీపాలతో అందంగా అలంకరించారు. నేటి నుంచి ఈ నెల 27 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉగాది పర్వదినం రోజున వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నెల 20న ఎదుర్కోలు ఉత్సవం, 21న శ్రీరామ నవమి రోజు సీతారాముల తిరు కళ్యాణ మహోత్సవం, 22న మహా పట్టాభిషేకం చేపడతారు. ఈ సందర్భంగా భద్రాద్రి ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.

ఇదీ చూడండి :రైతు ప్రయోజనాల కోసం కార్గో సేవల వినియోగం

ABOUT THE AUTHOR

...view details