తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్ ఎఫెక్ట్: భద్రాద్రి ఆలయం మూసివేత - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో భద్రాద్రి రామయ్య ఆలయాన్ని మూసేశారు. ఈ నెల 21 వరకు దర్శనాలను రద్దు చేసినట్లు ఆలయ ఈవో ప్రకటించారు. స్వామివారి నిత్య కైంకర్యాలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

bhadradri seetharama darshan suspended , bhadrachalam temple suspended
భద్రాద్రి ఆలయం మూసివేత, శ్రీసీతారాముల ఆలయం మూసివేత

By

Published : May 12, 2021, 4:00 PM IST

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి లాక్​డౌన్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భద్రాచలంలోని శ్రీసీతారాముల ఆలయాన్ని ఈ రోజు 10 గంటల నుంచి మూసేశారు. ఈ నెల 21 వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు.

స్వామివారి నిత్య కైంకర్యాలు యధావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా లాక్​డౌన్ కొనసాగుతోంది.

ఇదీ చదవండి:పెళ్లికి వెళ్లాలి పంపించండి సార్.. సరిహద్దుల్లో తప్పని తిప్పలు.!

ABOUT THE AUTHOR

...view details