తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి రామయ్యకు కోటికి పైగా ఆదాయం - తెలంగాణ వార్తలు

భద్రాద్రి రామయ్యకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. దేవస్థానంలో గత 80 రోజులుగా వచ్చిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.1,35,41,680 నగదు, 110 గ్రాముల బంగారం, కిలోకు పైగా వెండి స్వామివారికి భక్తులు సమర్పించారు.

భద్రాద్రి రామయ్యకు కోటికి పైగా ఆదాయం
భద్రాద్రి రామయ్యకు కోటికి పైగా ఆదాయం

By

Published : Jan 28, 2021, 10:12 PM IST

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామయ్య దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని గత 80 రోజులుగా భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించారు.

రూ.1,35,41,680 నగదు, 110 గ్రాముల బంగారం, కిలో 200 గ్రాముల వెండి, 34 యూఎస్​ డాలర్లు, 510 సౌత్ ఆఫ్రికా రాండ్, 01 మలేషియా రింగిట్, 2 ఖతార్ రియల్, 10 సౌదీ అరేబియన్ రియల్స్, 5 ఒమాన్ రియాల్, యూఏఈ దిరామ్స్​ కానుకలుగా వచ్చాయి. గత నెలలో భద్రాద్రిలో ముక్కోటి ఉత్సవాల సందర్భంగా హుండీ ఆదాయం పెరిగింది. లాక్​డౌన్​ అనంతరం ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి:'వారంరోజుల్లో సిద్దిపేట రైల్వేలైన్ పనులు ప్రారంభించాలి'

ABOUT THE AUTHOR

...view details