భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఏడవ రోజు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు శ్రీరామచంద్రుడు తన నిజ రూపమైన శ్రీరామ అవతారంలో దర్శనమిచ్చారు. భక్త రామదాసు చేయించిన బంగారు ఆభరణాలు, వజ్రాలు పొదిగిన మణి మాణిక్యాలతో లక్ష్మణ సమేత సీతారాములను ఆలయ అర్చకులు అందంగా అలంకరించారు.
ఏడవరోజు నిజరూప అవతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం - వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవరోజు స్వామి వారు తన నిజరూప అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బంగారు, వజ్రాభరణాలతో లక్ష్మణ సమేత సీతారాములను ఆలయ అర్చకులు అందంగా అలంకరించారు.

ఏడవరోజు నిజరూప అవతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం
లోకకంటకులైన రావణుడు, కుంభకర్ణుడు అనే రాక్షసులను సంహరించడానికి దశరథుని కుమారుడిగా మహావిష్ణువు.. శ్రీరామ అవతారం ఎత్తినట్లు ఆలయ వేద పండితులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:తెలంగాణ, ఏపీ నాబార్డు, ఎస్‌బీఐ మధ్య అవగాహన ఒప్పందం