కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామ చంద్ర స్వామి ఆలయంలో విలాస ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరిరోజైన ఇవాళ భద్రాద్రి రాముడు పట్టాభిరాముడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా లక్ష్మణ సమేత పట్టాభిరాముడిగా అలంకరించిన స్వామి వారిని చిత్రకూట మండపం వద్దకు తీసుకువచ్చారు. భరత శత్రుఘ్ననితో ఉన్న ఆంజనేయ స్వామిని చిత్రకూట మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
పట్టాభిరాముడిగా భద్రాద్రి రామయ్య దర్శనం - Bhadradri Ramayana temple news today
భద్రాచలంలోని రాములోరి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఈ సందర్భంగా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల 10న ప్రత్యేక విశ్వరూప పూజ జరగనుందని ఆలయ అర్చకులు వెల్లడించారు.

పట్టాభిరాముడిగా భద్రాద్రి రామయ్య దర్శనం
ఆలయ ఈవో శివాజీతోపాటు ఆలయ అధికారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకులు విశ్వక్సేన, అష్టోత్తర, ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఈ నెల 10న విశ్వరూప పూజ జరగనుంది. ఆలయంలో అందరు దేవతామూర్తులను ఒక వద్దకు చేర్చి ఈ పూజను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి :'చూపించినా.. రాజీనామా చేస్తా'