భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో.. రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో అవతారంలో దర్శనమిస్తోన్న రామయ్య... ఐదోరోజు రాజు అవతారంలో భక్తుల ముందుకొచ్చారు. చిత్రకూట మండపంలో వేద పండితులు మంత్రాలు పటిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఐదోరోజు రాజు అవతారంలో భద్రాద్రి రామయ్య - భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి
భద్రాచలంలో రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదోరోజు భద్రాద్రి రామయ్యను దర్శించుకొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఐదోరోజు రాజు అవతారంలో భద్రాద్రి రామయ్య
ఈ నెల 25న ప్రారంభమైన ఈ ఉత్సవాలు జనవరి 4 వరకు కొనసాగనున్నాయి. ఐదోరోజు భద్రాద్రి రామయ్యను దర్శించుకొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.