భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు రోజుకొక ప్రదేశానికి వెళ్లి భక్తులకు దర్శనమిస్తున్నారు. నాల్గో రోజైన శుక్రవారం రంగనాథ స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
రంగనాథ అలంకారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య - latest news on Bhadradri Ramaiah appearing in Ranganatha ornament
భద్రాచలంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు నాల్గోరోజు రంగనాథ స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
![రంగనాథ అలంకారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య Bhadradri Ramaiah appearing in Ranganatha ornament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5670642-826-5670642-1578718523166.jpg)
రంగనాథ అలంకారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య
మేళతాళాల నడుమ స్వామి వారు తాత గుడి సెంటర్ వద్దకు వెళ్లి అక్కడ గోవింద రాజస్వామి ఆలయంలో పూజలు అందుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
రంగనాథ అలంకారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య
ఇవీ చూడండి: పురపోరుకు 21,850 నామినేషన్లు.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో..