భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 8వ రోజైన నేడు స్వామివారు బలరామ అవతారంలో దర్శనం ఇస్తున్నారు.
బలరామావతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రాముడు - latest news on Bhadradri Rama appears in Balaramavatar
శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య నేడు బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
బలరామావతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రాముడు
మేళతాళాలు, మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారిని బేడా మండపం వద్దకు తీసుకువచ్చిన అర్చకులు.. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం తిరుప్పావై పాశురాలను పారాయణం చేశారు.మధ్యాహ్నం మహా నివేదన అనంతరం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి: ఓటర్ల ముసాయిదాపై అభ్యంతరాలకు గడువు పూర్తి