తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణుని ఆలయంలో ఘనంగా కూడారై ఉత్సవం - bhadradri kothgudem district latest news

రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కూడారై ఉత్సవం కల్యాణ సన్నిధిలో వైభవంగా జరిగింది. మహిళలు ఈ ఉత్సవంలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. భజనలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగిపోయింది.

bhadradri kudarai festival in bhadrachalam
కృష్ణుని ఆలయంలో ఘనంగా కూడారై ఉత్సవం

By

Published : Jan 11, 2021, 3:39 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధిలో కూడారై ఉత్సవం వైభవంగా జరిగింది. ధనుర్మాసం నెలంతా గోదాదేవి వ్రతాన్ని ఆచరించిన మహిళలు ఈరోజు కూడారై ఉత్సవాన్ని నిర్వహించారు.

108 గంగాళాల్లో.. పరమాన్నాన్ని వండి స్వామివారికి నైవేధ్యంగా సమర్పించారు. అనంతరం కృష్ణుని భక్తి గీతాలు ఆలపిస్తూ.. మంగళ హారతులు పాడారు. భజనలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, శ్రీ కృష్ణ సేవా సమితి మహిళలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభం

ABOUT THE AUTHOR

...view details