భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. వామపక్ష పార్టీలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇల్లందులోని జేకే కాలనీ, 24 ఏరియా గ్రౌండ్ వాకర్స్‌ని కలిసి ఓటుని అభ్యర్థించాడు.
అధికార పార్టీ మాటలు నమ్మొద్దు: జయసారథి రెడ్డి - Left-backed MLC candidate Jayasarathy Reddy campaigned extensively
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఇల్లందులో వామపక్ష పార్టీలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారథి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే కమ్యూనిస్టులు మద్దతు ఇస్తున్న తనను గెలిపించాలని కోరారు.
అధికార పార్టీ మాటలు నమ్మొద్దు: జయసారథి రెడ్డి
అనంతరం జేకే కాలనీ ఉపరితల గని కార్మికులతో సమావేశమయ్యారు. మార్చి 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే కమ్యూనిస్టులు మద్దతు ఇస్తున్న తనకు ఓటు వేయాలని కోరారు. అధికార తెరాస పార్టీ మాటలతో మభ్యపెడుతూ నిరుద్యోగులను, ఉద్యోగులను మోసం చేస్తోందన్నారు. వారి మాటలు నమ్మొద్దని వివరించారు.
ఇదీ చదవండి:గల్ఫ్‌లో తగ్గుతున్న ఉపాధి... లక్షల మంది ఇంటి ముఖం