భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. రాబోయే వర్షాకాలంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. గోదావరి నది కరకట్ట ప్రాంతంలో మరమ్మతులను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రాచలం పట్టణంలోకి వరద నీరు రాకుండా చూడాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ముందుగానే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంచాలని సూచించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలిసి వరదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
వరదలపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ రాబోయే వర్షాకాలంలో వరద ప్రమాదాలపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఏడాది వరదలతో గోదావరి నది లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని కలెక్టర్ అన్నారు. వానాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్
వరద పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలని కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అధికారులు జాగ్రత్త వహించాలని కోరారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ వినీత్, పోలీసు, పంచాయతీ, రెవెన్యూ, సీడబ్ల్యూసీ, ఇరిగేషన్, విద్యుత్, వైద్య, అటవీశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Minister Indrakaran: పల్లె, పట్టణ ప్రగతిపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు