పచ్చదనానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య అన్నారు. హరితహారం ద్వారా ప్రతి పట్టణం, గ్రామాల్లో మొక్కలు నాటే విధంగా ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం అడవుల పెంపకానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు.
పచ్చదనానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది: కోరం కనకయ్య
హరితహారం ద్వారా పట్టణాలు, గ్రామాల్లో మొక్కలు నాటే విధంగా తెలంగాణ సర్కారు కృషి చేస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య అన్నారు. 'పల్లె ప్రకృతి వనం' కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు.
పచ్చదనానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది: కోరం కనకయ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జయిగూడెం గ్రామ పంచాయతీలో 'పల్లె ప్రకృతి వనం' కార్యక్రమంలో భాగంగా కోరం కనకయ్య మొక్కలు నాటారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా చేపట్టాలని ఆయన అన్నారు.
ఇవీ చూడండి:తెలంగాణలో నీలివిప్లవం రాబోతుంది: మంత్రి హరీశ్ రావు