భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిధిలో ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. విత్తనాల విక్రయదారులు లైసెన్స్ కలిగి ఉండాలని, అమ్మిన వాటికి రశీదులు ఇవ్వాలని సూచించారు.
'నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు' - bhadradri dsp warning to duplicate ferilizers Marketers
ఖరీఫ్ సీజన్లో నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ రవీందర్ రెడ్డి
ఎవరైనా నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నట్లు అనుమానమొస్తే వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని రవీందర్ రెడ్డి కోరారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు రైతులు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తే ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.
- ఇదీ చదవండి:ఐదు రోజులు... ఆరు హత్యలు...