భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి పర్యటించారు. ఎస్‌బీఐతో పాటు అనుబంధ నగుదు పంపిణీ కేంద్రాలను ఆయన సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లో జమ చేసిన నగదు కోసం వచ్చిన మహిళలతో మాట్లాడారు.
'మాస్కు లేకుంటే 500 రూపాయల జరిమానా' - భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి
ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ కచ్చితంగా ధరించాలని... లేని పక్షంలో రూ.500 జరిమానా కట్టాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి హెచ్చరించారు.
'మాస్కు లేకుంటే 500 రూపాయల జరిమానా'
అదే సమయంలో కొందరు దూరం పాటించినా... మాస్కులు వేసుకోకపోవడంతో కలెక్టర్ వారిని హెచ్చరించారు. వచ్చే రూ.1500 రూపాయలలో రూ.500 రూపాయలు చెల్లించాలన్నారు. బ్యాంకు అధికారులు, కేంద్రాల నిర్వహకులతో మాట్లాడి నిబంధనలు పాటించేలా చూడాలని ఆదేశించారు.
ఇవీ చూడండి:రేపట్నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్ బంద్