COLLECTOR VISIT TEMPLE: మహాశివరాత్రి సందర్భంగా బూర్గంపాడు మండలం మోతె గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దర్శించుకున్నారు. ఈ ఆలయాన్ని శివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు.
COLLECTOR VISIT TEMPLE: నాటు పడవలో గోదావరి దాటి వీరభద్రునికి కలెక్టర్ పూజలు - ఖమ్మం తాజా వార్తలు
COLLECTOR VISIT TEMPLE: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ మోతె గడ్డ శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. కిలోమీటరు ఇసుకలో నడిచి నాలుగు వైపులా గోదావరి నది మధ్యలో ఆలయాన్ని సందర్శించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వీరభద్ర స్వామిని దర్శించుకున్న కలెక్టర్ అనుదీప్
కలెక్టర్కు ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా ఘన స్వాగతం పలికారు. మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ పూజలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భద్రాద్రి రామయ్య కల్యాణానికి సిద్ధమవుతున్న గోటి తలంబ్రాలు