తెలంగాణ

telangana

ETV Bharat / state

Bhadradri Hundi Counting: భద్రాద్రి సన్నిధిలో కొనసాగుతున్న హుండీ లెక్కింపు... - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు

Bhadradri Hundi Counting: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి సన్నిధిలో హుండీ లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం నుంచి హుండీలోని వెండి, బంగారం, నగదును తీసి... పోలీసు బందోబస్తు నడుమ లెక్కింపు ప్రారంభించారు. ప్రధాన ఆలయంలోని హుండీలతో పాటు ఉపఆలయాల హుండీల నగదు సైతం లెక్కిస్తున్నారు.

Bhadradri Hundi Counting
Bhadradri Hundi Counting

By

Published : Dec 27, 2021, 12:57 PM IST

Bhadradri Hundi Counting: భద్రాచలం రామయ్య సన్నిధిలో హుండీ లెక్కింపు కొనసాగుతోంది. గత 67 రోజులుగా స్వామివారికి హుండీలో భక్తులు వేసిన నగదును ఆలయ సిబ్బంది లెక్కిస్తున్నారు. ఉదయం హుండీలోని వెండి, బంగారం, నగదును తీసి... పోలీసు బందోబస్తు నడుమ చిత్రకూట మండపం వద్దకు తీసుకువెళ్లి లెక్కింపు ప్రారంభించారు.

అక్టోబరు 21న హుండీ ఆదాయం లెక్కించగా... అప్పటి నుంచి వచ్చిన ఆదాయం లెక్క తేలనుంది. ప్రధాన ఆలయంలోని హుండీలతో పాటు ఉపఆలయాల హుండీల నగదు లెక్కింపు సైతం నిర్వహిస్తున్నారు.

భద్రాద్రి సన్నిధిలో కొనసాగుతున్న హుండీ లెక్కింపు...

ఇదీ చదవండి:ఖమ్మంలో ఒమిక్రాన్.. అప్రమత్తమైన వైద్య సిబ్బంది..

ABOUT THE AUTHOR

...view details