దక్షిణ భారతదేశ గంగానదిగా పేరొందిన గోదావరి భద్రాచలం వద్ద పిల్లకాలువలా మారి ఆందోళన కలిగిస్తోంది. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం రెండు అడుగుల కంటే తక్కువగా నీటి మట్టం నమోదవుతోంది.
జిల్లాలో పిల్లకాలువను తలపిస్తోన్న గోదావరి - గోదావరి నదీ వార్తలు
గోదావరి నదిలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. ఈ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకానికి కొత్త కష్టాలు తలెత్తనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నది పిల్లకాలువను తలపిస్తోంది.

భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి నీటిమట్టం
అడుగంటిన గోదావరి జలాలు రాష్ట్రంలో పలు చోట్ల మిషన్ భగీరథ పథకానికి తాగునీటి కష్టాలు తేనున్నాయి. పదేళ్ల క్రితం వేసవికాలంలో కనిష్ఠంగా నీటిమట్టం 6 అడుగులు నమోదయింది.అయితే గత కొంత కాలంగా వేసవికాలంలో నీటి మట్టం 4 అడుగులలోపే ఉంటోంది.