పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల ఎదుట.. జెండాలు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇంధన ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నిరసన - నేటి పెట్రోల్ ధర
పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కరోనా కారణంగా ఉపాధి లేక ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతోంటే.. కేంద్రం తరచూ ఇంధన ధరలను పెంచుతూ పేదలపై మరింత ఆర్థిక భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
hike in petrol prices
భాజపా ఏడేళ్ల పాలనలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని నియోజకవర్గ ఇంఛార్జ్ వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ.. ఉద్యోగులు, రైతులను కూడా మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:Eatala: ఈటల నివాసానికి తరుణ్ చుగ్‌తో పాటు భాజపా నేతలు