తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారి తీసిన ఫోటోకు కలెక్టర్ ఫిదా - కలెక్టర్​ను ఫొటో తీసిన చిన్నారి

చిన్నారి ఆసక్తికరంగా తీసిన ఒక్క ఫొటో.. తన జీవితాన్నే మార్చేసింది. ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధిస్తేనే ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే యోగ్యం ఉంటుంది. కానీ ఈ చిన్నారి ఏ పరీక్ష రాయకుండానే.. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసించే అవకాశాన్ని దక్కించుకుంది.

bhadradri collector
భద్రాద్రి కలెక్టర్​

By

Published : Jan 16, 2021, 10:59 AM IST

Updated : Jan 16, 2021, 11:06 AM IST

ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ వసతులతో కూడిన పాఠశాల అడ్మిషన్లు పొందే పరిస్థితుల్లో ఒక్క ఫొటోతో తన జీవితాన్ని మార్చుకో గలిగింది చిన్నారి వైశాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పరిధిలోని సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్​ ఎంవీ రెడ్డి శుక్రవారం తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో తనను ఆసక్తిగా ఫొటో తీస్తున్న బాలికను ఆయన గమనించారు. చిన్నారి ఫొటో తీసేందుకు సహకరించి.. తరువాత ఫొటో చూపించమని కోరారు.

కలెక్టర్​ అభినందనలు

అనంతరం ఆ పాప.. కోతులు పట్టేందుకు తిరుపతి నుంచి వచ్చిన గణపతి అనే వ్యక్తి మనవరాలు అని కలెక్టర్​ తెలుసుకున్నారు. చురుకుదనం గల వైశాలికి ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంచి మంచి విద్యాభ్యాసానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోతులను పట్టి అడవుల్లో వదులుతున్న గణపతిని సైతం కలెక్టర్ అభినందించారు. తమకు కొంత బకాయి రావలసి ఉందని గణపతి చెప్పగా.. సంబంధిత బిల్లులు తక్షణమే చెల్లించాలని అధికారులకు సూచించారు. మరోవైపు పట్టణంలో పర్యటిస్తున్న కలెక్టర్.. చేపలు విక్రయిస్తున్న యువకుడి దగ్గరికి వెళ్లి మాట్లాడారు. మైనింగ్ విద్య చదువుతూ చేపలు విక్రయిస్తున్న అతడిని అభినందించి కరచాలనం చేశారు.

చేపలు విక్రయిస్తున్న యువకుడితో కలెక్టర్​ కరచాలనం

ఇదీ చదవండి:విద్యుత్తు బకాయిదారులు భారీగా పెరిగారు..!

Last Updated : Jan 16, 2021, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details