తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీతమ్మ సాగర్​ భూసేకరణ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి'

సీతమ్మ సాగర్​ ప్రాజెక్టు భూసేకరణ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. సర్వే పనులు పూర్తయితేనే ప్రాజెక్టు భూసేకరణ ప్రారంభించేందుకు అవకాశం ఉందన్నారు.

bhadradri additional collector inspector seethamma sagar land acquisition survey works
'సీతమ్మసాగర్​ భూసేకరణ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి'

By

Published : Jul 15, 2020, 4:43 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మించే సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ భూసేకరణ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కరకట్ట నిర్మాణానికి కావాల్సిన భూమిని సేకరించేందుకు మణుగూరు పట్టణం సమీపంలోని చినరాయిగూడెంలో మంగళవారం ఇంజినీర్లు సర్వే చేసి హద్దు రాళ్లు పాతారు. సర్వే పనులను అదనపు కలెక్టర్ పరిశీలించి ఇంజినీర్లకు తగు సూచనలు చేశారు. సర్వే పనులు పూర్తయితేనే భూసేకరణ ప్రారంభించేందుకు అవకాశం ఉందన్నారు.
గోదావరి నది ఒడ్డు నుంచి ఎంతమేరకు హద్దులు పాతారో అడిగి తెలుసుకున్నారు. రోజువారీగా జరిగే పనులు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఎంత మేరకు భూసేకరణ జరుగుతుందో సులువుగా తెలుసుకునేందుకు రహదారికి ఇరువైపులా హద్దులు పాతాలని సూచించారు. రెవెన్యూ అధికారులు, ఇంజినీర్లు అధికారులు సమన్వయంతో సర్వే పనులు పూర్తి చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details