Bhadrachalam Temple Lands Issue :భద్రాచలం సీతారామ స్వామి ఆలయ భూముల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కబ్జాదారులు.. అడ్డుకోబోయిన అధికారులపై దాడి చేసిన ఘటన సరిహద్దు గ్రామమైన ఎట్టపాకలో చోటుచేసుకుంది. ఈ ఘర్షణ దేవస్థానం నూతనంగా నిర్మించిన గోశాల సమీపంలో జరిగింది. భద్రాద్రి దేవస్థానానికి(Bhadrachalam Temple) సరిహద్దు గ్రామమైన.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎట్టపాక మండలంలోని పురుషోత్తపట్నంలో 900 ఎకరాల భూమి ఉంది.
Irregularities in Bhadrachalam MRO Office : దళారుల అడ్డా @భద్రాచలం ఎమ్మార్వో ఆఫీస్.. ఏ పని జరగాలన్నా వారే దిక్కు!
Clash Between Bhadrachalam Temple Officials and Land Grabbers :గత కొంతకాలంగా పురుషోత్తపట్నం గ్రామస్తులు.. దేవస్థానం భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొందరు పంటలను సాగుచేస్తున్నారు. ఈ వ్యవహారంపై భద్రాచలందేవస్థానం అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సదరు భూములు దేవస్థానానికే చెందుతాయంటూ సుప్రీం కోర్టు.. భద్రాద్రి ఆలయానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
Bhadradri Kothgudem Latest News : అక్కడి గ్రామస్థులు కోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ.. ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దేవస్థానం అధికారులకు సదరు సమాచారం అందింది. కబ్జాదారులను అడ్డుకునేందుకు అధికారులు హుటాహుటిన అక్రమిత ప్రాంతానికి చేరుకున్నారు. నిర్మాణ పనులను అడ్డుకోబోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన గ్రామస్థులు.. ఐడీఏ రవీందర్, ఏఈఓలు భవానీ రామకృష్ణ, శ్రావణ్ కుమార్‌లను కర్రలతో దాడి చేశారు.
Solar Plant in Bhadradri Ramayya Temple : భద్రాద్రి రామునికి సౌర వెలుగులు.. రాష్ట్రంలోనే తొలి ఆలయంగా రికార్డ్
Bhadrachalam Temple Lands Conflict :అక్రమ నిర్మాణాలను చిత్రీకరించడానికి వెళ్లిన మీడియాపై దురుసుగా ప్రవర్తించి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. ఆలయానికి, పురుషోత్తపట్నం గ్రామంలోని భూములకు ఎటువంటి సంబంధం లేదని, అవి వారికే సొంతమని గ్రామస్థులు పేర్కొంటున్నారని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎట్టపాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అక్కడికి వచ్చిన తహశీల్దార్, స్థానిక అధికారులు గ్రామస్థులకే సహకరిస్తున్నారని తెలిపారు. ఈ దాడిని ఖండిస్తున్నామని.. చట్టపరంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
"భద్రాచల ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కబ్జాదారులు.. అడ్డుకోబోయిన అధికారులపై దాడి చేశారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎట్టపాక మండలంలోని పురుషోత్తపట్నంలో 900 ఏకరాల భూమి ఉంది. సదరు భూములు దేవస్థానానికే చెందుతాయని.. సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పును పట్టించుకోకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. దాడిచేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాము". - రమాదేవి, ఈవో భద్రాద్రి దేవస్థానం
Bhadrachalam Temple Lands Issue రామ రామ ఇదేం దుర్మార్గం.. అక్రమ నిర్మాణాలు అడ్డుకున్నందుకు అధికారులపై దాడి Navaratri Celebrations in Telangana : ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు.. దుర్గామాత అలంకరణలో భద్రకాళీ అమ్మవారి దర్శనం