భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహిస్తున్నారు. గత 56 రోజులుగా స్వామి వారికి భక్తులు హుండీల్లో సమర్పించిన నగదు, బంగారు, వెండి వస్తువులు, ఇతర దేశాల కరెన్సీని లెక్కిస్తున్నారు.
భద్రాద్రి హుండీ ఆదాయం లెక్కింపు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం
భద్రాద్రి రామయ్య ఆలయంలో గత 56 రోజుల హుండీ ఆదాయం లెక్కింపు జరుగుతోంది. భక్తుల ద్వారా సుమారు 50 లక్షలకు పైగా ఆదాయం రావొచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
రాములోరి ఆలయం హుండీ ఆదాయం లెక్కింపు
జనవరి 28న గతంలో వచ్చిన ఆదాయం లెక్కించిన అధికారులు.. జనవరి 28 తర్వాత ఇప్పటివరకు హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కౌంట్ చేస్తున్నారు. ప్రధాన ఆలయం, ఆలయం చుట్టూ ఉన్న హుండీల్లోని నగదును తీసి చిత్రకూట మండపంలో లెక్కిస్తున్నారు. 56 రోజులుగా భక్తుల ద్వారా సుమారు యాభై లక్షలకు పైగా ఆదాయం రావచ్చని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి :యాదాద్రి ఆలయంలో గంట విద్యుద్దీపాల ప్రయోగాత్మక పరీక్ష