భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్నారు. స్వామివారు బుధవారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాజ భోగం అనంతరం స్వామి వారిని మేళ తాళాలు నడుమ చిత్రకూట మండపం వద్దకు తీసుకొచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. కరోనా కారణంగా స్వామివారి తిరువీధి సేవలు, తీర్థ ప్రసాదం రద్దు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఈనెల 25 వరకు నిత్య కల్యాణాలు నిలిపివేశారు.
అవతార విశిష్టత..