Bhadrachalam Temple: రాములోరి భక్తులకు భద్రాచలం దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించిన అధికారులు.. ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రామయ్య కల్యాణానికి రేపటి నుంచే టికెట్ల విక్రయం.. ధరెంతో తెలుసా..? - Bhadradri Sita Ramachandraswamy Devasthanam news
Bhadrachalam Temple: భద్రాచలం సీతారాముల కల్యాణ వేడుక టికెట్లను రేపు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ఆలయ ఈవో శివాజీ వెల్లడించారు. ఏప్రిల్ 10 కల్యాణం, 11న రామయ్య పట్టాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వేడుకలకు భక్తులను అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.
ఏప్రిల్ 10న శ్రీరామనవమి సందర్భంగా.. సీతారాముల కల్యాణ మహోత్సవానికి భక్తులందరికీ అనుమతి ఇస్తున్నట్లు ఈవో శివాజీ వెల్లడించారు. ఇందు కోసం రేపటి నుంచి ఆన్లైన్ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. www.bhadrachalamonline.com వెబ్సైట్లో రేపటి నుంచి రూ.7500, రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లు అందుబాటులో ఉంటాయని ఈవో తెలిపారు. ఏప్రిల్ 11న జరగనున్న శ్రీరాముని పట్టాభిషేకం ఉత్సవానికి రూ.1000 టికెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు.. భద్రాద్రి రామయ్య- సీతమ్మ కల్యాణ మహాత్సవం కోసం నేరుగా కల్యాణ మండపం వద్దకు చేరుకోవాలని సూచించారు.