కరోనా వైరస్ కట్టడిపై అవగాహన కల్పిస్తూ భద్రాచలం నుంచి సైకిల్ యాత్ర చేపట్టారు. జిల్లా నలుమూలలకు వెళ్లి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు.
కరోనాపై అవగాహనే లక్ష్యంగా సైకిల్ యాత్ర - కరోనాపై భద్రాచలవాసి అవగాహన యాత్ర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రకాశ్ అనే వ్యక్తి... భద్రాచలం నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించారు. లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రజలను కోరుతున్నారు.
కరోనాపై భద్రాచలవాసి సైకిల్ యాత్ర
ఈ యాత్రలో భాగంగా ఇల్లందు చేరుకున్న ప్రకాశ్‌ను జిల్లా కలెక్టర్ ఎంవీవీ రెడ్డి, ఎమ్మెల్యే హరిప్రియ, ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు అభినందించారు.