భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవారం సాయంత్రం లక్ష్మణ సమేత సీతారాములను తిరువీధి సేవకు తీసుకెళ్తుండగా.. తేలికపాటి జల్లు కురిసింది. తిరువీధి సేవను మధ్యలో నిలిపివేసి స్వామి వారిని వెనక్కి తీసుకువెళ్లారు.
చినుకులు పడటం వల్ల మధ్యలో ఆగిన తిరువీధి సేవ - తెలంగాణ వార్తలు
లక్ష్మణ సమేత సీతారాముల తిరువీధి సేవకు వర్షం ఆటంకం కలిగించింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామి వారిని సేవకు తీసుకెళ్తుండగా తేలికపాటి జల్లు కురిసింది. తిరువీధి సేవను మధ్యలో నిలిపివేసి స్వామి వారిని వెనక్కి తీసుకువెళ్లారు.
చినుకులు పడటం వల్ల మధ్యలో ఆగిన తిరువీధి సేవ
శుక్రవారం జరిగిన రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామి వారిని ఏడున్నర గంటలకు తిరువీధి సేవకు తీసుకువెళ్లాలి. ఆలయంలోని కొందరు విధులకు ఆలస్యంగా రావడం వల్ల స్వామి వారిని ఎనిమిదిన్నర గంటలకు చంద్రప్రభ వాహనంపై తిరువీధి సేవకు తయారు చేశారు. ఆలయం నుంచి స్వామివారు బయటకు రాగానే చిన్నపాటి చినుకులు పడగా.. తిరువీధి సేవ మధ్యలోనే ఆగిపోయింది.
ఇదీ చూడండి:నీతి ఆయోగ్ భేటీ... రాష్ట్ర విజయాలు ప్రస్తావించనున్న కేసీఆర్