తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాచలం ఆస్పత్రి సిబ్బందిపై ఐటీడీఏ పీవో ఆగ్రహం - po visit bhadrachalam area hospital

భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిని ఐటీడీఏ పీవో గౌతం తనిఖీ చేశారు. పనివేళల్లో వైద్యులు విధుల్లో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భద్రాచలం ఆస్పత్రి సిబ్బందిపై ఐటీడీఏ పీవో ఆగ్రహం

By

Published : May 27, 2019, 5:50 PM IST

Updated : May 27, 2019, 6:41 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఐటీడీఏ పీవో వీపీ గౌతం ఆకస్మిక తనిఖీ చేశారు. గత కొంత కాలంగా ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, చికిత్స సమయంలో వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుపై రోగులతో మాట్లాడారు. పనివేళల్లో విధుల్లో ఉండాల్సిన వైద్యులు, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి వార్డుకు వెళ్లి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. కాన్పు సమయంలో కొందరు సిబ్బంది రూ. 500 తీసుకుంటున్నారని వారు పీవో దృష్టికి తీసుకువచ్చారు. అపరేషన్​ థియేటర్​ వద్ద పనిచేసే సిబ్బందిని సస్పెండ్​ చేయాలని ఆదేశించారు. ఒప్పంద ఉద్యోగులను నియమించే సంస్థను బ్లాక్​ లిస్టులో పెట్టాలని అధికారులకు సూచించారు. విధుల్లో ఆలసత్వం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

భద్రాచలం ఆస్పత్రి సిబ్బందిపై ఐటీడీఏ పీవో ఆగ్రహం

ఇవీ చూడండి: పోలీసు విధుల్లో వికసించిన మానవత్వం

Last Updated : May 27, 2019, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details