తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా సోకి మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

కరోనా సోకి మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి
కరోనా సోకి మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

By

Published : Aug 4, 2020, 6:41 AM IST

Updated : Aug 4, 2020, 10:52 AM IST

06:39 August 04

కరోనా సోకి మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీపీఎం దిగ్గజ నేత సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. సున్నం రాజయ్య ఇద్దరు కుమారులు, అల్లుడికి కూడా కరోనా నిర్ధరణ అయింది. వారు ఏపీ తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరులో చికిత్స పొందున్నారు.  

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏపీలోని వి.ఆర్.పురం మండలంలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ నెగిటివ్ వచ్చింది. ఆయన ఆరోగ్యం మెరుగవడం లేదని 2 రోజుల క్రితం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం సాయంత్రం ఆయనకు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడకు వెళ్లాలని వైద్యులు సూచించారు.

అప్పటికే ఆయాసంతో బాధపడుతున్న సున్నం రాజయ్యను విజయవాడ తరలిస్తుండగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత మృతిచెందారు. ఆయన పార్థివ దేహాన్ని తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం సున్నా వారి గూడెం వద్దకు తీసుకువచ్చారు. త్వరగా అంత్యక్రియలు చేయాలని వైద్యులు తెలపడం వల్ల మంగళవారం ఉదయం ఏడు గంటలకు ఆ గ్రామంలోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.  

ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం సున్నా వారి గూడెంలో సున్నం రాజయ్య జన్మించారు. చిన్ననాటినుంచే వారి కుటుంబం మొత్తం సీపీఎం పార్టీ సిద్ధాంతాలను అనుసరించడం వల్ల.. ఆ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లా నుంచి సీపీఎం నాయకులుగా ఉంటూ భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1999, 2004, 2014 సంవత్సరాలలో భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచారు.  

ఇవీ చూడండి: 'ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలి'

Last Updated : Aug 4, 2020, 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details